Service

ఓం శ్రీ సాయిరాం "డ్రాప్ అవుట్ నుండి స్వామి వారి దివ్యసన్నిధిలో సేవ వరకు భాస్కర్ ప్రస్థానం" సంగారెడ్డి జిల్లా జోగిపేట సమితి పరిధిలో గల సోమక్కపేట గ్రామానికి చెందిన బాతుల భాస్కర్ నిరుపేద కుటుంబం. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. విద్యార్థి చదువులో రాణించిన వాడే అయినప్పటికీ అర్థిక పరిస్థితుల దృశ్య కరోనా తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల జోగిపేటలో చదువుతు కళాశాలకు రావడం మానేశాడు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి రజిత మేడం గారి ద్వారా విషయం తెలుసుకున్న మన సంస్థ సభ్యులు కేస్ స్టడీ నిర్వహించి భాస్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పిల్లవాని భవిష్యత్తు పాడు చేయవద్దని ఒప్పించి అతనికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చి తిరిగి కళాశాలకు రప్పించడం జరిగింది. ఆ విధంగా కళాశాల తరగతులకు రెగ్యులర్ గా హాజరుఅవుతు తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావడం జరిగింది. ప్రస్తుతం 2022-23 సం. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డిలో డిగ్రీ చదువుతున్న భాస్కర్ యూత్ స్పెషల్ బ్యాచ్ సేవలో పాల్గొని 8 రోజులు పాటు స్వామి వారి దివ్య సన్నిధిలో సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవ చేసి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. (తన వెంట తెచ్చుకున్న 200 రూపాయలతో స్వామి పుస్తకాలను కొనుక్కొని వెళ్లడం విశేషం) ఎన్నో జన్మల పుణ్యఫలంగా స్వామి వారి దివ్య సన్నిధిలో సేవ చేసే భాగ్యం పొందిన ధన్యుడు భాస్కర్. స్వామి వారు ఆ పిల్లవానికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించి వెంట, జంట ఉండాలని కోరుకుందాం. జై సాయిరాం 🙏