ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అపార కృప అనుగ్రహ ప్రేమాశీస్సులతో రంగారెడ్డి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వారు Dec 2020 నుండి 2025 Nov వరకు స్వామి వారి దివ్య ప్రేమతో సత్సంకల్పించుకున్న స్వామివారి 100 వ జన్మ దినోత్సవ వేడుకలలో ఆధ్యాత్మిక కార్యక్రమము లో భాగంగా స్వామి వారి అపార అనుగ్రహ దయతో 100 సార్లు,100 క్షేత్రములలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం చేయాలనే స్వామి వారి దివ్య ప్రేరణతో సత్సంకల్పం. అందులో భాగంగా తేదీ 30-10-2022 అదివారం నాడు వేద పండితులు ,మరియు వేదము పఠించే మన సాయి కుటుంభ సభ్యులచే 44 వ సామూహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సాయీశ్వర మహాదేవుని కి నదీ జలములతో పంచామృతాల తో, పండ్ల రసములతో,పంచ ద్రవ్యములతో విభూతి తో సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరిగింది ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ శ్రీ రుద్ర పారాయణము తో అభిషేఖం, బిల్వాష్టకము, లింగాష్టకము,పంచ సూక్త పారాయణములు, శివోపాసన మంత్రం, మరియు మహాశివ లింగమునకు చక్కటి అలంకారం తో, సప్త హారతులు, భజన మరియు స్వామి వారి అవతార వైభవ సందేశము, మరియు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి మహా మంగళ హారతి తో వేడుక ముగించటమైనది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆనంద ఆధ్యాత్మిక కార్యక్రమమును అదిలాబాద్ జిల్లా లో గల స్థానిక సమితి మందిరం లో* జరిగింది. ఉదయం.09.18.గం.కు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమై మ.3.15 కి పూర్తి అయినది. అత్యంత ఉత్సాహంగా,ఆనందము గా జిల్లా DP గారు శ్రీ.నర్సింహ రావు గారు, జిల్లా భాద్యులు, స్థానిక సమితి కన్వీనర్,జిల్లాలోని ఇతర సమన్వయ కర్తలు ,అనేక మంది భక్తులు, మహిళలు,యువత పురప్రముకులు, పాల్గొన్నారు. ఇట్టి ఆనంద ఆధ్యాత్మిక వేడుకలో SSSSO రంగారెడ్డి జిల్లా సభ్యులు,మరియు స్థానిక సభ్యులు అందరూ కలిసి సుమారు 750 మంది పైగా ప్రత్యక్షంగా అభిషేకం లో పాల్గొన్నారు. మరియు అందరికి మహాప్రసాదం అందించారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక అభిషేఖం లో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి పవిత్ర భక్తి హృదయాలతో స్వామి వారిని ప్రత్యక్షంగా అభిషేకించి శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు, పాత్రులయ్యామని ఎందరో సంతోషం వ్యక్తపరిచారు.. ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకోవడానికి అవకాశమిచ్చి, ప్రత్యక్ష దివ్య ఆనంద అనుభూతి కలిగించి, మనలో,మనతో ఉండి విజయవంతము అందించిన మన బంగారు తండ్రి పరిపూర్ణావతారి హృదయవాసి, సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద శ్రీ చరణములకు కృతజ్ఞతా పూర్వక అనంత కోటి వందనములు సమర్పించు కుంటున్నాము. సామూహిక నామ స్మరణ ,రుద్ర పారాయణము, ఇంత చక్కటి అనేక వేదికలు,సాయి కేంద్రముల ద్వారా ఎంతో మంది అనేక కొత్త వారిని కలుసుకునే చక్కటి మహా అవకాశము స్వామి వారు కల్పిస్తున్నారు... ఇంత చక్కటి వేడుకకు చక్కటి ఏర్పాట్లు చేసి స్వామి వారిపై భక్తి విశ్వాసములతో వేదిక చక్కటి అలంకరణ, స్వామి వారు నచ్చేలా,మెచ్చేలా అందరూ ఐక్యతతో ప్రేమతో భక్తితో పాల్గొని, ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపకు పాత్రులయ్యామని, స్వామి వారి దయతో మంచిగా అందరి సాయి హృదయ బంధువులతో కలిసి వేడుక చేసుకున్నామని ఆనందం, సంతోషం వ్యక్తపరిచారు.. వేదిక, చక్కటి అలంకారంతో, చక్కటి ఏర్పాట్లు తో మరియు అందరి భక్తులకు మహా ప్రసాదము తో ఏర్పాట్లు చేసిన సంస్థ భాద్యులు సభ్యులు,మహిళలు,యువత, వారి కుటుంభ సభ్యుల కు స్వామి వారి కృప,దయ అనుగ్రహ ఆశీస్సులు దండిగా మెండుగా అందిస్తారని స్వామి వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్థూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక శుభ వందనములు. సాయిరాం🙏🙏🙏🙏 ~~~~~ 45 వది.తేదీ. 06.11.2022 నాడు నాగర్ కర్నూల్ జిల్లా చెన్నారం లో గల శ్రీ సత్యసాయి దివ్య సేవా పవిత్ర కేంద్రములో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం --------------------------------------------- 97 గంటల అఖండ భజన తేదీ.09.11.2022 బుధవారం సా.5.00 Pm నుండి... తేదీ.13.11.2022 ఆదివారంనాడు సా.6.00 Pm వరకు ...మహా హారతి.. --------------------------------------------- 46 . తేదీ.14.11.2022 కార్తీక 3 వ సోమవారం నాడు నల్గొండ జిల్లా లో గల చింతపల్లి లో గల శ్రీ షిర్దీసాయి బాబా మందిరములో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గోపూజా కార్యక్రమము ఇతర ఆధ్యాత్మిక పవిత్ర కార్తీక మాస వేడుకలు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 97 వ జన్మదిన వేడుకలు ప్రత్యేక కార్యక్రమాలు లో భాగంగా Nov 18 శుక్రవారంనాడు ప్రశాంతి నిలయములో జరిగే శ్రీ వేణుగోపాల స్వామి దివ్య రథోత్సవం వేడుకలో* సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనటం. 47 వది తేదీ.04. 12.2022 నాడు జగిత్యాల జిల్లా మెటుపల్లి మందిరము లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం. 48 వ ది తేదీ.11.12.2022 నాడు నాగర్ కర్నూల్ జిల్లా అచంపేట సమితి మందిరములో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 49 వ ది తేదీ.19.12.22 నాడు భూపాల్ పల్లి జిల్లా స్థానిక మందిరములో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 50 వది 2023 జనవరి 01తేదీ, ఆదివారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రామప్ప దేవాలయము లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 51 వది తేదీ.22.01.2023 ఆదివారం నాడు సంగారెడ్డి జిల్లా జోగిపేట కేంద్రము లో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 52 వది తేదీ.26.01.23 గురువారం నాడు వరంగల్ (R)జిల్లా లో గల పరకాల మందిరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. 53 వది తేదీ.29.01.2023 ఆదివారంనాడు జనగామ జిల్లా స్థానిక సమితి కేంద్రములో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. 54 వది తేదీ..05.02.23 ఆదివారం పవిత్ర మాఘ పూర్ణిమ నాడు పెద్దపల్లి జిల్లా లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. 55 వది తేదీ.19.02.23 ఆదివారంనాడు..యాదాద్రి జిల్లా లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ------------------------------------------- తేదీ..03.03.2023 శుక్రవారంనాదు శ్రీ సత్యసాయి విద్యా విహార్ పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమము.. ------------------- -- ------------------ 56 వది తేదీ. 12.03.23 ఆదివారంనాడు వనపర్తి జిల్లా లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం.. 57 వది తే.19.03.23 నాడు పెద్దపల్లి జిల్లాలో మహాన్యాస రుద్రాభిషేకము. 58 వది తేదీ.26.03.23 ఆదివారం నాడు గద్వాల జిల్లా స్థానికి మందిరములో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. 59 వది తేదీ.07.05.23 నాడు కోమరంభీం జిల్లాలో రుద్రాభిషేకం 60 వది తేదీ.21.05.23.నాడు నిర్మల్ జిల్లాలో రుద్రాభిషేకం. ఈ విధంగా మహా రుద్రాభిషేఖం లు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమములు ప్రస్తుతానికి నిర్ణయం అనుకోవటం జరిగింది. ఇందులో ఏదేని మార్పులు ఉంటే,అప్పటి పరిస్థితులను బట్టి ,సంస్థ వివిధ విభాగముల కార్యక్రమము లను బట్టి మార్పులు ఉంటే తెలియచేయ బడుతుంది 🙏 సాయిరాం🙏 సదా శ్రీ సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా,తెలంగాణ