ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు భద్రాద్రి జిల్లా మణుగూరు సమీపం లోని పాముల పల్లి, బట్టి మల్లయ్య గుంపు, మరియు ఆనంద పురం గ్రామాలలో వరద ముంపుకు గురి అయిన బాధితులకు 192 అమృత కలశాలు వీటితో పాటు దుప్పటి, చీర, లుంగీ, టవలు ఒక్కొక్క కుటుంబానికి స్వామి ప్రేమకు చిహ్నంగా అందించడం జరిగింది. ఈ సేవలో కొత్త గూడెం, భద్రాచలం, పాల్వంచ మణుగూరు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.