శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భద్రాద్రి జిల్లా తరఫున గోదావరి వరదలతో మణుగూరు పరిసర ప్రాంతంలో తీవ్రoగా నష్ట పోయిన ముంపు ప్రాంతాల్లోని నిరాశ్రయులకు 200 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, ఆయిల్, కారం, ఉప్పు మొదలగు 8 రకముల ఆహార దినుసులు మరియు వస్త్రములు (ఒక దుప్పటి ఒక చీర) అందించుటకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ భద్రాద్రి జిల్లా ద్వారా మణుగూరు నుండి సుమారు 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న రాయి గూడెం ST కాలనీ మరియు కమలాపురం గుంపు వారికి అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్ K మాధవి గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.అలాగే కొత్త గూడెం, పాల్వంచ, మణుగూరు సేవాదళ్ సభ్యులు ఈ సేవలో పాల్గొన్నారు