Service




శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా ఆల్వాల్ సమితి యువ సంచార నారాయణ సేవా ( శ్రీ సత్య సాయి భోజన ప్రసాద వితరణ ) (తేదీ: 09.07.2022 , రెండవ శనివారం) వర్ష ఋతుపవనాలు ప్రభావము వలన తీవ్ర వర్షము కురుస్తున్న లెక్క చేయక వాతావరణం పెడుతున్న ఇబ్బందిని అధిగమించి సేవ దృక్పథం మనుసులోఉన్న దృఢ సంకల్పంచే స్వామి పై అచంచలమైన విశ్వాసముతో దీనజనుల సేవలో అల్వాల్ సమితి యువత తామే భక్తి శ్రద్దలతో వండిన భోజన ప్రసాదమును బ్రహ్మర్పణం గావించి 210 భోజనామృత పొట్లాలలుగా చేసి, రైన్ కోట్లు ధరించి జలమైన రోడ్లలో ధైర్యముగా ప్రయాణిస్తూ కనిపించిన నిలువు నీడ లేని బిక్కు బిక్కు మంటున్న దీన జనుల నారాయణులకు దగ్గరికి వెళ్లి వారికీ స్వామి వారి భోజన ప్రసాదము అందించి వారి హృదయపూర్వక ఆశిస్యులు పొంది కృతార్ధులయ్యారని అనటంలో అతిశయోక్తి లేదు.వారి సేవ తత్పరత కు మెచ్చి గర్వపడుతూ వారికీ స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్యులు అనుగ్రహించాలని స్వామిని మనసారా కోరుకుంటున్నాను. ఈ సేవలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మరియు 10 మంది యువకులు పాల్గొని సేవలందించారు. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు కన్వీనర్