ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ ఎప్పుడూ సాయం చేయండి.. ఎన్నటికీ బాధించకండి అనే పరిపూర్ణ దివ్యావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నిరంతర భోధనల పునాదిగా,షరతులు లేని ప్రేమను విశ్వవ్యాప్తం చేయడం కోసం అవిర్భవించిందే శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ సిస్టమ్.. చేతిలో డబ్బు లేకుండా ఆస్పత్రికి గాని,సాధారణ వైద్యుని దగ్గరికి గాని వెళ్లడం ఉహించగలమా!.. అటువంటి ప్రదేశం కనుగొనడం కూడా అసాధ్యం.. కానీ దక్షిణ భారత దేశంలో ఒక మారుమూల కుగ్రామము పుట్టపర్తిలో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు తమ తల్లిగారు శ్రీమతి ఈశ్వరాంభ గారి కోరిక మేరకు 1954లో మొదటగా ఒక ప్రజా ఆసుపత్రి స్థాపించారు... ఇంతింతై వటుడింతై అన్నట్లు అలా మొగ్గ తొడగిన ఈ ఆసుపత్రి నేడు ప్రజా ఆస్పత్రిల నెట్ వర్క్,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, సంచార వైద్య ఆసుపత్రి సేవలు,వైద్య శిభిరములు, మందిరముల లో జరిగే వైద్య సేవలు, వాస్తవిక ఉచిత ఆసుపత్రులు, నగర ఆసుపత్రుల్లో దాతృత్వ పడకల ఏర్పాటు,టెలీ మెడిసిన్ సేవలు,రక్త దాన శిభిరములు, గ్రామీణ వైద్య శిభిరములు,గిరిజన గూడెంలలో వైద్య సేవలు, అన్ని విభాగములలో ఉచితంగా సేవలు చేస్తూ,ఉచిత పరీక్షలు,ఉచిత శస్త్ర చికిత్సలు, ఉచిత లాబ్ పరీక్షలు,ఉచిత కంటి అధ్ధాలు ,చంటి పిల్లల వైద్యం నుండి,గుండె,మూత్రపిండములు, నరాలు,ఎముకల వ్యాధి, ENT,ఇతర అన్ని జబ్బులకు ఈ విధంగా ఎంతో విలువైన వైద్య సేవలు శ్రీ సత్యసాయి ట్రస్ట్, సేవా సంస్థలు ద్వారా విశ్వవ్యాప్తంగా అనేక దేశాలలో పూర్తిగా ఉచితంగా వైద్యులతో సహా ,ఆహారం, వసతులతో సహా రోగులకు అందుబాటులోకి వైద్య సేవలు అందించబడుతున్నాయి. 1954 లో సాదారణ ఆసుపత్రి 1991 లో 153000 SFT తో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. 2001 లో బెంగుళూర్ లోని వైట్ ఫీల్డ్ లో 500 మించిన పడకలతో, 20 శస్త్ర చికిత్స గదులతో,12 ICU లతో, అప్పటి ప్రధాన మంత్రుల ద్వారా భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు పేదలకు,ఏ ఆధారం లేని వారికి,ప్రాంతాలకు వర్గాలకు, వర్ణాలకు,మతాలకు,అతీతంగా, మనందరి పై ప్రేమతో ఉచిత వైద్య సేవలు అందించేలా స్థాపించారు.... ఆత్మీయులైన డాక్టర్ లకు, హృదయ పూర్వక సాయిరాం. అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. 'వైద్యో నారాయణో హరిః' అన్నట్టు దైవ సమానముగా భావింపబడుతున్న పవిత్ర వైద్య వృత్తిలో ఉంటూ, రాత్రనక పగలనక తమ అమూల్య సమయాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ద్వారా జరిగే అనేక విభాగాల వైద్య సేవలలో, మానవాళి సేవలలో వినియోగిస్తున్న మీకు,మీ కుటుంభ సభ్యులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను భగవంతుడు సదా రక్షించాలని కోరుకుంటున్నాము. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా నిర్వహింప బడుతున్న నిస్వార్థ వైద్య సేవలకు మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తున్న సహాయ సహకారాలు, స్వామి వారి 100 వ జన్మదిన వేడుకలలో జరిగే అనేక వైద్య సేవ కార్యక్రమములలో ద్విగుణీకృతం చేయాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ పవిత్ర సేవా కార్యక్రమములో వైద్యులతో పాటు,ప్యారా మెడికల్ వారు,ఫార్మసీ వారు,శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర పెద్దలు, వైద్య సమన్వయకర్తలు, సేవాదల్ పురుషులు, యువత,మహిళలు, ప్రత్యక్షంగా,పరోక్షంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఈ జులై 1 డాక్టర్స్ డే శుభాకాంక్షలు, శుభాభినందనలు. సాయిరాం సదా సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా