రేగోడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు అందరికీ కూడా సత్యసాయి సేవా సమితి ద్వారా ఈరోజు హాజరైన విద్యార్థులందరికీ నోటు బుక్స్ అందజేయడం జరిగింది. అంతేకాకుండా మండలంలోని T. లింగంపల్లి పాఠశాలకు కూడా వెళ్లి సత్యసాయి సేవా సమితి సభ్యులు విద్యార్థులందరికీ నోట్ బుక్ అందజేయడం జరిగింది. 6,7 తరగతులకు ఆరు నోట్ బుక్స్, రెండు పెన్నులు, పెన్సిల్, స్కేల్ అందజేశారు. 8, 9, 10 విద్యార్థిని విద్యార్థులకు 7 నోట్ బుక్స్ తో పాటు రెండు పెన్నులు, పెన్సిలు, స్కేల్ మరియు జామెట్రీ బాక్స్ లు కూడా అందించడం జరిగింది. విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు సామగ్రి చేసినందుకు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు శంకరప్ప గారు, మరియు ఇతర సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ గారు, స్థానిక ఎంపిటిసి నర్సింలు గారు, పెద్దలు శ్యామ్ రావు కులకర్ణి గారు, సర్దార్ పటేల్ గారు, రాచోటి సుభాష్ గారు, ఫాజిల్ గారు, మర్పల్లి గ్రామ పెద్దలు గున్న సంగమేశ్వర్ గుప్తా గారు మరియు పాఠశాల యొక్క ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.