ఓం శ్రీ సాయిరాం🙏 ఆత్మీయ సాయి బంధువులకు హృదయపూర్వక సాయిరాం🙏 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అపార దయ అనుగ్రహ ప్రేమాశీస్సులు తో స్వామి వారి దివ్య ప్రేమతో ప్రేరణతో సత్సంకల్పం చేసుకున్న శ్రీ గాయత్రి మంత్రం దశ కోటి నామ పారాయణ మహా యజ్ఞం సామూహికంగా May 1 వ తేదీ నుండి జూన్ 10 వ తేదీ వరకు 41 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలతో పాటు ఇక్కడి వారి బంధువులు , స్నేహితులు,సాయి విద్యార్థులు, మరియు ఇతర దేశములలో ఉన్న వారి బంధువులు కూడా కలిసి సంకల్పిత దశ కోటి పారాయణము ను ఈ 41 రోజులలో 10 కోట్ల 81 లక్షల 64 వేల 9 వందల ఇరవై ఏడు( 10,81,64,927) సంఖ్య ను చేసి, శ్రీ వేద మాత శ్రీ గాయత్రి దేవి అమ్మ వారి పరిపూర్ణ దివ్యానుగ్రహాశీస్సులతో సుమారు 10000 మంది పైగా భక్తులు శ్రీ సాయి మాత దివ్యానుగ్రహమునకు నోచుకోడానికి స్వామి వారు మనందరికీ చక్కటి అనుగ్రహ అవకాశము ఇచ్చారు... ఈ పారాయణం ముగింపు వేడుకలో 11 నాడు శ్రీ లక్ష్మీ గణపతి హోమము చేసుకోవడమైనది . 12 వ తేదీ ఆదివారంనాడు శ్రీ గాయత్రి అమ్మ వారి సంకల్ప పూజా కార్యక్రమము, తర్వాత శ్రీ సాయి గాయత్రి హోమము,శ్రీ గాయత్రి హోమము మహా పూర్ణాహుతి కార్యక్రమము స్వామి వారి దయతో సరూర్ నగర్ మందిరములో అత్యంత ఆనందముగా,వైభవంగా చేసుకోవడమైనది.. ఈ ఆనంద ముగింపు వేడుకలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ P. వెంకటరావు గారు,రాష్ట్ర సమన్వయ కర్తలు శ్రీమతి.నాగజ్యోతి గారు,మరియు శ్రీ A. భాస్కర్ గారు హోమము కార్యక్రమములో,మహపూర్ణాహుతి వేడుకలో స్వయంగా హోమములో ,పూజలో కూర్చొని పాల్గొన్నారు.. వీలుచేసుకొని వివిధ జిల్లాల సిద్ధిపేట,కరీంనగర్, సూర్యాపేట, మహాబాబా నగర్,సంగారెడ్డి అధ్యక్షుల వారు , వారి సమన్వయ కర్తలు, పెద్దపల్లి,కామారెడ్డి,మెదక్ సమన్వయకర్తలు, మరియు రాష్ట్ర సమన్వయకర్తలు శ్రీ హరనాథ్ రెడ్డి గారు, శ్రీ రాంబాబు గారు,శ్రీ భాస్కర్ రావు గారు, శ్రీ.MLN స్వామి గారు,సంస్థ పెద్దలు అనేక మంది, రంగారెడ్డి జిల్లా వివిధ సమితుల కన్వీనర్లు,సభ్యులు,భక్తులు ఈ ముగింపు హోమము, పూర్ణాహుతి కార్యక్రమము లో పాల్గొని మనందరి ద్వారా చేయించిన పారాయణము ను శ్రీ సాయి మాత దివ్య పాదముల చెంత సమర్పించుకొన్నారు రాష్ట్ర అధ్యక్షులు వారు,శ్రీ P. వెంకట్ రావు గారు సంస్థ ద్వారా సామూహికంగా జరిగే ఇలాంటి ఏ కార్యక్రమమైనా చక్కటి దివ్యానుభూతి కలిగిస్తుందని, స్వామి వారు బోధించిన అనేక దివ్య భోధనల ద్వారా సూచించిన అమృత వాక్కులను ,మరియు స్వామి వారి దివ్య వైభవము సందేశమును తెలియచేశారు... మరియు మొదటగా శ్రీ MLN స్వామి గారు శ్రీ గాయత్రి మంత్రం విశిష్టత గురించి ,తెలియచేశారు.. ముగింపు వేడుకలో 600 మంది పైగా పాల్గొన్నారు..800 మందికి మహా ప్రసాదం పంపిణీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పారాయణము లో పాల్గొన్న ప్రతి సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు వారి ద్వారా, వివిధ జిల్లాల అధ్యక్షుల వారి ద్వారా మరియు వారి సమన్వయకర్తలు ద్వారా శ్రీ గాయత్రి దేవి అమ్మ వారి ప్రసాదం లడ్డు,విభూతి,అమ్మవారి ఫొటో ప్రేమతో అందించటమైనది.. పూర్ణాహుతి రోజు,మరియు సోమవారంనాడు సుమారు 12600 లడ్డులు పైగా పంపిణీ జరిగింది. ఇంత చక్కటి ఆధ్యాత్మిక సామూహిక వేడుకకు అవకాశమిచి,ఇంత మంది భక్తులతో సామూహికంగా 41 రోజులు దీక్ష గా చేయించిన పరి పూర్ణ దివ్య ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద చరణముల కు అనంత కోటి కృతజ్ఞతాభి వందనములు సమర్పిస్తూ, కార్యక్రమము ప్రారంభము నుండి అనేక సూచనలు,సలహాలతో ప్రత్యక్షంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులు వారికి, ఆధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ రేగేళ్ల అనిల్ కుమార్ గారికి,ప్రత్యక్షంగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వారు,జిల్లా సమన్వయకర్తలు వారికి,మరియు పారాయణము ప్రతి రోజు ప్రోత్సహించి, సంఖ్య ను తెలియ చేసేలా సహకరించిన ప్రతి ఒక్క రాష్ట్ర భాద్యులు,జిల్లా భాద్యులు,భక్తులు,సాయి హృదయబంధువులు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయ పూర్వక అభి వందనములు సాయిరాం 🙏🙏 ప్రత్యక్షంగా,పరోక్షంగా ఈ ఆనంద వేడుకలో,పూర్ణాహుతి సేవలో, ప్రసాద పంపిణీ లో పాల్గొన్న ప్రతి సేవాదల్ సభ్యులకు హృదయ పూర్వక సాయిరాం🙏🙏 🙏 సాయిరాం🙏 సదా సాయి సేవలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా