శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా ఈశ్వరమ్మ మాతృ దినోత్సవము మాయ మర్మములెరుగని మాతృమూర్తి మాతృత్వం మకరందం కన్నా మధురమైనదని ఆ ఈశ్వరుడు నే మరుగొల్పగ మదిని తలచినంతనే ఈశ్వరమ్మగా తన తల్లిగా ఎంచి ఆయమ్మ గర్భముయందే జన్మించి ఈ భువి పై అవతరించిన సాయీశ్వరుడు. ఎంతటి భాగ్యశాలి కదా ఆయమ్మ ఈశ్వరుడునే ఆడించిన ఘనత ఆమెదేకదా.తన పుత్రుడైన స్వామిని భగవన్తుడుగా గ్రహించి సర్వ మానవాళి శ్రేయస్సుకై కోరిన కోర్కెలెను తూచా తప్పకుండ తీర్చి స్వామిని మనకు అందించిన మాతృ మూర్తి ఈశ్వరమ్మ. ఆయమ్మ నిష్కామ ప్రేమ తత్వానికి పరవశించి తనయందే తనలోనే ఐక్యం చేసుకున్న సాయీశ్వరుడు నేటితో 50 సంవత్సరాలు పూర్తి గావించబడ్డాయి. ఈ సందర్బంగా అల్వాల్ శ్రీ సత్య సాయి మందిరములో మాతృదెవొ దినోత్సవము నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక సేవలో అల్వాల్ పుర మహిళలు స్వచందంగా తమ పిల్లలతో విచ్చేయగా వారి పిల్లలతో అల్వాల్ సమితి మహిళా విభాగ్ వారు మాతృ పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా 60 మంది మహిళలు మరియు 130 మంది బాల బాలికలు పాల్గొనగా అల్వాల్ మందిరం ఆధ్యామిక శోభ సంతరించుకొని కళాకలాడినది. సాయంత్రం ప్రత్యేక భజన నిర్వహించగా శ్రీమతి లీలావతి గారు సాయి మాత ఈశ్వరమ్మ జన్మ విశిష్టతను తెలియజేస్తూ ప్రసంగించారు.అనంతరం మహిళా విభాగ్ వారిచే మంగళ నీరాజనం సమర్పించడం జరిగినది. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు, కన్వీనర్