Balvikas






శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా చిన్నారులకు వేసవి విడిది శిబిరం ప్రాథమిక పాఠశాలలు వేసవి సెలవులు వచ్చాయి అంటే అల్వాల్ మరియు పరిసర ప్రాంతాల చిన్నారుల చూపులు అల్వాల్ లో స్వామి వారి శ్రీ సత్య సాయి మందిరం యొక్క వేసవి విడిది ద్వారాలు వైపు ఎప్పుడు ఎప్పుడు తెరుచుకుంటాయని అని ఎదురుచూస్తుంటారు.ఆ తరుణం రానే వచ్చింది నేడు స్వామి మందిర ద్వారాలు చిన్నారులకు వేసవి విడిదికి తెరుచుకున్నాయలేదో సుమారు 150 మంది చిన్నారులు ఉత్సాహముతో ఉరకలు పరుగులతో వారి తల్లితండ్రులతో విచ్చేసి వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకొని స్వాగత సమావేశములో పాల్గొనంతరం వారి వారి వేసవి తరగతులకు హాజరైయ్యారు. నేటి చిన్నారులకు స్వామి వారి వేసవి విడిది యొక్క శిభిరం ప్రారంభోత్సవానికి మన జిల్లా అధ్యక్షులు అయినా శ్రీ మంథా సోమసుందరం గారిచే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం అధ్యక్షుల వారి సందేశాత్మక ప్రసంగం చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేసవి విడిదిలో చిన్నారులకు, యోగ , ధ్యానం, క్రాఫ్ట్, పెయింటింగ్, స్టోరీ చెప్పడం,, పెద్దల పట్ల గౌరవం, భారతీయ సంస్కృతి యొక్క విలువలు తెలియజేయడం పాటలు పాడడం, నృత్యం లో తర్పీదు ఇస్తూ చిన్నారులను ఆకట్టుకుంటూ వారి మనో వికాసానికి తోడ్పడటం అనేది సమితి యొక్క యువత ముఖ్య లక్ష్యం. వారి లక్ష్య సాధనలో స్వామి వారి కరుణ కటాక్ష వీక్షణములు వారి పై ప్రసరింప జేయాలని వేడుకుంటూ వారికీ శుభాకాంక్షలు తెలుపుతూ… సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు కన్వీనర్