Service



శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా చలివేంద్రా సేవల అంతరార్థం ప్రతి దేహం నడియాడే దేవాలయం ఆ దేవాలయంలో నివసించే జీవమే శివుడు. అటువంటి నడియాడే దేవాలయం లోని శివునికి అభిషేక సేవలు అందించడమే చలివేంద్రా సేవలు. ఇలా ప్రతి నడయాడే సర్వ ధర్మ దేవాలయములు మనం కూర్చున్న చోటుకు విచ్చేసి మనం అందించే నిష్కామ సేవల ద్వారా గంగను స్వీకరించి ఆ అభిషేకప్రియుడైన సకల చరా చరాలకు స్వామి అయినా సర్వాంతర్యామి సర్వేశరుడు శ్రీ సత్య సాయీశుడు మనం వేడుకోకుండానే వారి దివ్య మంగళకరంమైన ఆశీస్యులు మనకు ప్రసాదిస్తూ మన మనుగడకు బాటను సుమగం చేస్తూ మన ఇంట వెంటా జంటగా ఉంటూ భవసాగరాన్ని దాటవేయిస్తాడు. ఇలా భగవన్తుని సులభముగా ప్రసన్నము చేసుకునే సేవా మార్గమును స్వామి వారు మనకు ప్రసాదించడం మనం చేసుకున్న పూర్వజన్మలో సుకృతంగా భావిస్తూ అల్వాల్ సమితి లోని భక్తులు మరియు అనుబంధ భజన మండలి భక్తులు చలివేంద్రా సేవలలో వారంతవారు స్వచ్ఛంద విచ్చేసి సేవలందిస్తున్నారు. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు కన్వీనర్