Balvikas




శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా చిన్నారుల వేసవి విడిది శిభిరం కల్లకపటమెరుగని మాయమర్మమేమి లేని బాలలు సర్వ ధర్మాలకు ప్రతిరూపాలు. వారే భగవన్తుని ప్రతినిధులు. అల్వాల్ శ్రీ సత్య సాయి మందిరములో ఏర్పాటు చేసిన చిన్నారులకు వేసవి విడిది శిబిరంలో 120 మంది బాల బాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉల్లాసభరితముగా సృష్టిస్తూ ఆడిస్తూ పాడిస్తూ వివిధ కళలలో నైపుణ్యంలో తర్పీదిస్తు వారిని ఆకర్షిస్తూ వారి మనోభావాలను క్రమశిక్షణతో కూడిన సత్ప్రవర్తనతో నిజాయితీ వైపు వారి ధ్యాసను మల్లించాలనే ప్రయత్నములో సమితి లోని యువత మరియు బాలవికాస్ గురువుల మనస్సులు కూడా పరివర్తన చెందుతూ హృదయానందముతో పాటు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందున్నామని యువతతో పాటు బాలవికాస్ గురువులు కూడా తెలియజేస్తుంటే వారిని కన్న తల్లిదండ్రులు కూడా ఆనందానికి అవధులు లేవు. ఇలా వారి సేవానిరతికి మెచ్చి సమితి లోని సభ్యులందరు వారికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. ఇదే కదా మన సత్య సాయి భగవానునికి కావలసింది ప్రతివారు పరివర్తన చెందుతూ ప్రేమ స్వరూపులుగా మారి జగమంతా ప్రేమమయముగా మారాలనే స్వామి వారి ఆకాంక్ష .ఇటువంటి మంచి అనుభూతిని ప్రసాదిస్తున్న స్వామి వారి చరణాలవిందములకు ప్రణమిల్లుతూ. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు కన్వీనర్