ఓం శ్రీ సాయిరాం🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ తరఫున ఆదివారం, మే 1 నాడు అగ్ని బాధితులకు నిర్వహించిన అత్యవసర సేవ ములుగు జిల్లా శనిగ కుంట గ్రామములోని ఇళ్లు పూర్తిగా దగ్ధమైన 40 ఇళ్ళ వారికి , స్వామి వారి ప్రేమకి చిహ్నంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ ద్వారా సత్వరం స్పందించి అమృత కలశములు, బిందెలు, చెంబులు, కంచములు, దోమ తెరలు, దుప్పట్లు, పంచలు, లుంగీలు, చీరలు, బకెట్, మగ్గులు.... అత్యవసర నిత్యావసర వస్తువులు ఆదివారం, 1 మే నాడు అందించనైనది. తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, జిల్లా కలెక్టర్, జిల్లా చైర్మన్, అధికారులు,గ్రామస్థులు ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని శ్రీ సత్యసాయి సేవా సంస్థల సేవా నిరతుని అభినందించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ తరఫున శ్రీ అశోక్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ సమన్వయ కర్త, శ్రీ రేగళ్ళ అనిల్ కుమార్, రాష్ట్ర ఆధ్యాత్మిక విభాగ సమన్వయ కర్త, శ్రీ మల్లా రెడ్డి,భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు, శ్రీరామచంద్ర రెడ్డి, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర డిసాస్టర్ మేనేజ్ మెంట్ సమన్వయకర్త, నాలుగు జిల్లాల సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, తెలంగాణ ద్వారా ములుగు జిల్లా శనిగ కుంట లబ్ధిదారులకు అందించిన అత్యవసర , నిత్యావసర వస్తువుల వివరములు : పసుపు - పావు కిలో స్టీల్ బిందె - 1 స్టీల్ చెంబులు - 1 స్టీల్ ప్లేట్లు - 2 స్టీల్ glass లు - 2. ప్లాస్టిక్ బకెట్ - 1. ప్లాస్టిక్ మగ్ - 1 దోమ తెర - 1 ప్లాస్టిక్ మ్యాట్ - 1 సోలార్ ల్యాంప్ - 1 చీరలు - 2 టవల్ - 2 పంచ - 1. దోవతి - 1 బనియన్ - 1 అండర్ వియర్ - 1 టీ షర్ట్ - 1 పిల్లలకు ప్యాంట్ - 1 పిల్లలకు. బ్లూ టార్పాలిన్ షీట్ - 1 దుప్పటి - 1 రగ్గు - 1 అమృత కలశం బియ్యం - 10 కేజీ గోధుమ పిండి - 2 కేజీ కంది పప్పు - 1 కేజీ నూనె - 1 కేజీ ఉల్లిపాయలు - 1 కేజీ ఒంటి సబ్బు - 1 బట్టల సబ్బు - 1 క్యాండిల్స్ - 5. అగ్గిపెట్టె - 1. సాయి ప్రోటీన్ - అర కేజీ కారం - పావు కిలో ఉప్పు - అర కిలో