శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవముల సందర్భంగా చేయ సంకల్పించిన గ్రామ సేవ లలో భాగంగా వనస్థలిపురం సమితి ఎంచుకన్న గ్రామములలో ఒకటైన చీదేడు గ్రామంలో 17 - 4 - 2022 ఆదివారం కార్యక్రమాల ప్రారంభోత్సవం చేయడమైనది. గ్రామము : చీదేడు మండలము : మంచాల జిల్లా : రంగారెడ్డి సర్పంచ్ పేరు : శ్రీ రమాకాంత్ రెడ్డి జనాభా : 800 ఇళ్ళు : 250 గుడి : హనుమాన్ దేవాలయం బడి : ప్రాథమికోన్నత పాఠశాల ప్రై . హె . సెం : దగ్గరలోని రంగాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయములో స్వామి వారిని ఆహ్వానించి గణపతి ప్రార్థన మరియు వేద మంత్రములతో కార్యక్రమములు ప్రారంభమైనవి. తదుపరి స్వామివారి పల్లకీ ఊరేగింపుతో గ్రామ సంకీర్తన నిర్వహించడమైనది. ఇంటింటికి స్వామి వారి ప్రసాదం అందించడమైనది. మహిళా విభాగ్ వారు గ్రామస్థులచేత తండులార్చన మరియు స్వామి వారి అష్టోత్తర శతనామ పూజ నిర్వహింపచేసిరి. మహిళా విభాగ్ వారు గ్రామీణులకు సాయి ప్రొటీన్ యెక్క ప్రాముఖ్యతను తెలిపి గ్రామంలోని గర్భిణీ స్త్రీలందరకూ (10 మందికి) గ్రామ ఆశా వర్కర్ శ్రీమతి అరుణ గారి చేతులమీదుగా సాయి ప్రొటీన్ అందచేయడమైనది. బాలవికాస్ గురువులు పిల్లలందరినీ చేరదీసి వారికి కొంచెం సేపు ప్రాథమిక బాలవికాస్ ను నిర్వహించి వారికి బిస్కెట్ పేకట్లు పంచిరి. గ్రామసేవలు వాటి విశిష్టత స్వామి వారి ధృక్పధం అన్న అంశంపై సమితి ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ యన్.రామకృష్ణ గారు చిన్న ప్రసంగం ఇవ్వడమైనది. స్వామి వారి దివ్య దర్శనం వీడియో ద్వారా ప్రదర్శించడమైనది. చివరగా గ్రామ సర్పంచ్ శ్రీ రమాకాంత్ రెడ్డి గారిచే స్వామికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమములు సంపన్నమైనవి. కార్యక్రములన్నీ స్వామి వారి దవ్య పాదపద్మములచెంత సమర్పస్తూ... సదా సాయి సేవలో కృష్ణ కుమార్ కన్వీనర్ వనస్థలిపురం సమితి