ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శతజయంతి ఉత్సవములలో బాగముగా తేదీ 17.04.2022 రాష్ట్రవ్యాప్తముగా తలపెట్టిన గ్రామసేవా కార్యక్రమము జిల్లాలో 2 గ్రామములలో నిర్వహించుకున్నాము. 🔸 శ్రీ సత్యసాయి సేవా సమితి గోదావరిఖని వారిచే జనగామ గ్రామములో స్థానిక కోదండరామాలయములో ఉ.10:00 - 1:30 ఓంకారం, భజనతో ప్రారంభించుకోగా అనంతరం జనగామ బస్టాండ్ నందు చాలివేంద్రం ప్రారంభించుకున్నాము, అనంతరం నగర సంకీర్తన, సత్సంగము, శ్రీ సత్యసాయి బాలవికాస్ ఆవశ్యకత తెలియచేయటం జరిగినది. 🔸 శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్దపల్లి సా.5:00 -6:30 వరకు రంగంపల్లి గ్రామములో భజన, నగరసంకీర్తన, సత్సంగము, శ్రీ సత్యసాయి బాలవికాస్ విశిష్టత తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, గ్రామపెద్దలు, గ్రామస్థులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా వివిధ కోఆర్డినెటర్లు సమితి కన్వీనర్లు, వివిధ కోఆర్డినెటర్లు, సభ్యులు పాల్గొన్నారు.లాక్డౌన్lockdown సమయములో కోవిడ్ సేవల లబ్ధిదారులు పాల్గొని కోవిడ్ టైంలో మాకు అన్నం పెట్టిన దేవుడు సాయిబాబా వారు ఇప్పుడు మా ఊరికి రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 🔸 నేషనల్ నారాయణ సేవ పెద్దపల్లి జిల్లాలో ప్రతీ నెలా 21 అమృతకలశములు అందించటం జరిగినది. 🔸 ప్రతీ గురువారం జిల్లాలోని అన్ని చాలివేంద్రం లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. 🔸శనివారం 16.4.2022 హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి భజనమండలి విట్ఠల్ నగర్ వారిచే నిర్వహిస్తున్న చాలివేంద్రములో మరియు శ్రీ సత్యసాయి భజనమండలి మేడిపల్లి వారిచే నిర్వహించే చలివేంద్రం నందు మజ్జిగ అందించటం జరిగినది. 🔸ప్రతీ సోమవారం 8వకాలని వారాంతపు సంతలో మ. 12.30 - 1.30 వరకు మజ్జిగ ఇస్తున్నాము సదా సాయి సేవలో శ్రీ సత్య సాయి సేవ సంస్థలు పెద్దపల్లి జిల్లా