భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో స్వామి వారు నాగర్కర్నూల్ విచ్చేసినటువంటి రోజు 30.03.1979 ఈ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సమితి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్థానిక టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నందు శ్రీసత్యసాయి స్వచ్ఛ జలధార చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు మర్రి జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి యొక్క బోధనలు సమితి సభ్యులు ఆచరణ చేయడం నిజంగా అభినందనీయమని సత్యసాయి సేవా సమితి సభ్యులను వారు అభినందించారు