Service






శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా సాయి నారాయణ సేవతో కోరికల పై అదుపు కోర్కెలు అనంతం. అందరికీ కోరికలు వుండటం సహజం. కానీ కోర్కెలను అదుపు చేసుకున్న వారే విజ్ఞులు. వారు శాశ్వత ఆనందాన్ని కోరుకుంటారు. సాయీశ్వరుని చింతన మరియు స్వామి వారి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనిషి శాశ్వత ఆనందం పొందడం సాద్యామౌతుంది. ఐశ్వర్యముతో ఐహిక సుఖాన్ని, ఆనందాన్ని పొందడం అనేది వట్టి భ్రమ అని గ్రహించిన అల్వాల్ మరియు అనుబంధ భజన మండలి సభ్యులు కోర్కెలను అదుపు( ceiling on desire) చేసుకొని పొదుపు చేసుకున్న ధనాన్ని స్వామి వారి సంచార నారాయణ సేవలో మరియు శ్రీ సత్య సాయి దివ్యామృత కలశముల( ఒక చిన్న కుటుంబానికి ఒక నెల సరిపడా నిత్యావసర ఆహార కిరాణా సరుకులను) కు వినియోగిస్తూ మరియు ప్రతి ఒక్కరు సేవలలో స్వయముగా పాల్గొంటూ దివ్య ఆనందాన్ని పొందుతున్నారు. నిన్న మార్చ్ నెల మొదటి శనివారం సందర్బంగా అల్వాల్ శ్రీ సత్య సాయి సేవా మందిరములో సంచార నారాయణ సేవలో భాగముగా గోపాల నగర్ వీకేర్ సెక్షన్ కాలనీ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్ధి చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహార పొట్లాలను అందించడం మరియు అల్వాల్ మరియు అనుబంధ భజన మండలి పుర వీధులలో సంచరిస్తూ కనపడిన 245 మంది నిరుపేద నారాయణులకు స్వామి వారి దివ్య అన్న ఆహార ప్రసాద ( ఒకపూట ఒకరికి సరిపడా ఆహారము ) పొట్లాలను అందిస్తూ సేవలందిస్తూ 21 మంది ఎంపిక చేయపడ్డ అర్హులైన చిన్న కుటుంబాలకు యదా విధిగా ఒక నెల సరిపడా శ్రీ సత్య సాయి దివ్యామృత కలశములు అందించడం జరిగినది. ఈ విశిష్ట సేవా కార్యక్రమములో 25 పురుష సేవాదళ్ మరియు 12 మంది మహిళా సేవాదళ్ పాల్గొన్నారు. సదా సాయి సేవలో జె ఈశ్వర్ రావు కన్వీనర్