ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహాశీస్సులతో యాచారం దగ్గర గల అయ్యవారి గూడెం భజన మండలి అనుబంధ గ్రామము సింగారం లో నూతన దేవాలయము నిర్మించి అందులో శ్రీ సీతా రామ చంద్ర లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి మూర్తుల ప్రతిష్టా మహోత్సవ వేడుకలు ఈ నెల 19.02.22 నుండి 21 02.22 వరకు జరిగాయి....మన శ్రీ సత్యసాయి సంస్థ కు అనుబంధంగా ఉన్న ఈ గ్రామ పెద్దలు మన సంస్థ సభ్యులను మహాప్రసాదం తయారు చేసే సేవ చేయాలని మన సరూర్ నగర్ మందిరములో అభ్యర్థించడం జరిగింది..... వారి కోరిక మన్నించి ఆ గ్రామములో జరిగే ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనే భక్తులకు ఈ మూడు రోజులు మహాప్రసాదం చేయడమైనది... .. ప్రతిరోజు వైట్ రైస్,బిర్యానీ, పప్పు,మసాలా కూర,సాంబార్,. పాయసం,చట్నీ,వడియాలు, పెరుగు, కిచిడీ,ఉప్మా,టీ ఈ విధంగా తయారు చేసి స్వామి వారికి నివేదన,బ్రహ్మార్పణం చేసిన తర్వాత భక్తులకు పంపిణీ చేయడమైనది.. ఈ మూడు రోజులలో 20000 మంది భక్తులకు పైగా మహాప్రసాదం అందించట మైనది. ఇందులో సరూర్ నగర్,నంది వనపర్తి, ఇబ్రాహీంపట్నం, అయ్యవారిగూడెం యువత, కొమ్మనబావి వారు అందరూ కలిసి 40 మంది జెంట్స్ సభ్యులు,10 మంది మహిళా సేవాదల్ సభ్యులు చాలా ఆనందంగా ప్రతిరోజు సుమారు 20 గంటల వరకు సేవలో పాల్గొని శ్రీ సాయి అన్న పూర్ణ మాత అనుగ్రహ ఆశీస్సులు అందుకున్నా మని సంతోషం వ్యక్తపరిచారు.. ఆ గ్రామ సభ్యులు,గ్రామ పురోహితులు,ప్రధానంగా భక్తి TV లో ఉన్న కోటి దీపోత్సవం ముఖ్య పురోహితులు శ్రీ రాజు శర్మ గారు,అరవింద్ శర్మ గారు శ్రీ సత్యసాయి సంస్థ,ట్రస్ట్ చేస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు..ఎంతో సంతోషం అందరూ వ్యక్తపరిచారు.. ఈ మూడు రోజుల సేవా అవకాశాన్ని ఇచ్చి మనలో,మనతో ప్రత్యక్షంగా ఉండి ఆనందంగా దిగ్విజయం చేయించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములు కు కృతజ్ఞతా పూర్వక వందనములు సమర్పించుకుంటూ,సహకరించి,పాల్గొన్న ప్రతి సేవాదల్ సభ్యులకు,అయ్యవారిగూడెం యువత కు పేరు పేరు నా హృదయపూర్వక నమస్సులు తెలియచేసుకుంటూ *సాయిరాం సదా సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా