ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అపార కృప అనుగ్రహ ప్రేమాశీస్సులతో రంగారెడ్డి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ద్వారా Dec 2020 నుండి 2025 Nov వరకు జరుపుకునే స్వామివారి (100 వ జన్మదిన) శత జయంతి ఉత్సవాల వేడుకలలో ఆధ్యాత్మిక కార్యక్రమము లో భాగంగా 100 సార్లు,100 క్షేత్రములలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం చేయాలనే సత్సంకల్పం. అందులో భాగంగా తేదీ 20-02-2022 అదివారం నాడు వేద పండితులు కోటి దీపోత్సవం ప్రధాన అర్చకులు శ్రీ రాజు శర్మ గారిచే ,మరియు వేదము పఠించే మన సాయి కుటుంభ సభ్యులచే 22 వ సామూహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సాయీశ్వర మహాదేవుని కి నదీ జలములతో, పంచామృతాల తో, పండ్ల రసములతో, పంచద్రవ్యములతో,విభూతితో సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరిగింది ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణము, బిల్వాష్టకము, లింగాష్టకము, శ్రీ సూక్తము, పురుష సూక్త పారాయణము, శివోపాసన మంత్రం, మరియు మహాశివ లింగమునకు చక్కటి అలంకారం తో, సప్త హారతులు, భజన మరియు స్వామి వారి అవతార వైభవ సందేశము, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి మహా మంగళ హారతి తో వేడుక ముగించటమైనది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆనంద ఆధ్యాత్మిక కార్యక్రమమును రంగారెడ్డి జిల్లా లో గల అయ్యవారిగూడెం భజన మండలి అనుబంధ గ్రామము సింగారం లో శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి నూతన మందిరము లో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం లో జరిగింది. ఉదయం.11.45 గం.కు ప్రారంభమై శ్రీ రాజు శర్మ గారు అరవింద్ శర్మ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మధ్యాహ్నం 05.30 ని.ల" వరకు నిర్వహించ బడినది........ అత్యంత ఉత్సాహంగా, ఆనందము గా వ్యాసాశ్రమము పీఠాధిపతి శ్రీ శ్రీ పరిశుధ్ధానంద స్వామి వారు ప్రత్యక్షంగా ప్రథమంగా అభిషేఖం లో పాల్గొన్నారు. అనేక మంది, భక్తులు ,చుట్టు వుండే గ్రామ భక్తులు, సభ్యులు, పాల్గొన్నారు. ఇట్టి ఆనంద ఆధ్యాత్మిక వేడుకలో SSSSO రంగారెడ్డి జిల్లా సభ్యులు, సభ్యులు, అందరూ కలిసి సుమారు 1800 మంది పైగా ప్రత్యక్షంగా అభిషేఖంలో పాల్గొన్నారు. మరియు 3000 మందికి పైగా అందరికి మహాప్రసాదం అందించారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక అభిషేఖం లో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి పవిత్ర భక్తి హృదయాలతో స్వామి వారిని ప్రత్యక్షంగా అభిషేకించి శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు, పాత్రులయ్యామని ఎందరో సంతోషం వ్యక్తపరిచారు.. ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకోవడానికి అవకాశమిచ్చి, ప్రత్యక్ష దివ్య అనుభూతి కలిగించి, విజయవంతము అందించిన మన బంగారు తండ్రి పరిపూర్ణావతారి హృదయవాసి, సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద శ్రీ చరణములకు కృతజ్ఞతా పూర్వక అనంత కోటి వందనములు సమర్పించు కుంటున్నాము. సామూహిక నామ స్మరణ ,రుద్ర పారాయణము, ఇంత చక్కటి అనేక వేదికలు,సాయి కేంద్రముల ద్వారా ఎంతో మంది అనేక కొత్త వారిని కలుసుకునే చక్కటి మహా అవకాశము స్వామి వారు కల్పిస్తున్నారు... ఇంత చక్కటి వేడుకకు దేవాలయ కమిటీ సభ్యులు,ముఖ్యంగా ఇక్కడి పెద్దవారు యువత కొద్దీ రోజుల వ్యవధి లోనే చక్కటి ఏర్పాట్లు చేసి స్వామి వారిపై భక్తి విశ్వాసములతో మందిరము,వేదిక చక్కటి అలంకరణ, స్వామి వారు నచ్చేలా,మెచ్చేలా అందరూ ఐక్యతతో ప్రేమతో భక్తితో పాల్గొని ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపకు పాత్రులయ్యామని ఆనందం, సంతోషం వ్యక్తపరిచారు.. వేదిక, చక్కటి అలంకారంతో, చక్కటి ఏర్పాట్లు తో మరియు అందరి భక్తులకు మహా ప్రసాదముతో ఏర్పాట్లు చేసిన గ్రామ పెద్దలు, అందరి సభ్యులు, మహిళలు,యువత, వారి కుటుంభ సభ్యుల కు స్వామి వారి కృప,దయ అనుగ్రహ ఆశీస్సులు దండిగా మెండుగా అందిస్తారని స్వామి వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్థూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక శుభ వందనములు. సాయిరాం🙏🙏🙏🙏 ★★★★★★◆★★★★★★ 23 వది 27.02.2022 నాడు వికారాబాద్ జిల్లా తాండూరు మందిరము లో.. 24 వది.06.03.22 ఆదివారంనాడు నల్గొండ జిల్లా దేవరకొండ మందిరములో 25 వది.13..03.2022 నాడు సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ మందిరములో 26 వది 20.03 2022 కరీంనగర్ జిల్లా మందిరము లో మహా రుద్రాభిషేఖం 27 27.03.2022 ఆదివారం నాడు మహా బాబా నగర్ జిల్లా వెన్నచెడు సమితి మందిరము లో 28 వది 17.04.2022 సిద్ధిపేట జిల్లా స్థానిక సమితి మందిరములో 29 వది, 01.05.2022 సూర్యాపేట జిల్లా కోటపహాడ్ సమితి ద్వారా 30 వది.15.05.2022.కొత్తకోట భజన మండలిలో వనపర్తి జిల్లా లో మహా రుద్రాభిషేఖం . 31 వది 29.05.2022 నాడు నిజామాబాదు సమితి మందిరములో మహా రుద్రాభిషేఖం May 1 వ తేదీ నుండి June 10 వరకు 41 రోజులు శ్రీ గాయత్రి మంత్రం కోటి పారాయణ మహా యజ్ఞం. June 11,12 నాడు శ్రీ గాయత్రి మంత్రం కోటి పారాయణ మహా యజ్ఞం మహా పూర్ణాహుతి. ఈ విధంగా మహా రుద్రాభిషేఖం, కార్యక్రమములు ప్రస్తుతానికి నిర్ణయం అనుకోవటం జరిగింది. ఇందులో ఏదేని మార్పులు ఉంటే,అప్పటి పరిస్థితులను బట్టి ,సంస్థ వివిధ విభాగముల కార్యక్రమము లను బట్టి మార్పులు ఉంటే తెలియచేయ బడుతుంది. 🙏 సాయిరాం🙏 సదా శ్రీ సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా,తెలంగాణ