ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు మహిళా దినోత్సవం నాగర్ కర్నూలు జిల్లా తరపున ట్రైబల్ విలేజ్ డెవలప్మెంట్ గ్రామమైన ఆవులోని బాయి తాండలో జరుపుకోవడం జరిగింది. ఆ గ్రామంలో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ సంకీర్తన నిర్వహించుకోడం జరిగింది. 50 మందికి దోమతెరలు ఇవ్వడం జరిగింది. నలుగురు గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమ మరియు సాయి ప్రోటీన్ ,గాజులు, ఇవ్వడం జరిగింది. తాండ పిల్లలకు బాలవికాస్ ప్రారంభం చేసినాము . పిల్లలకు 26 మందికి సాయి ప్రోటీన్స్ ఇవ్వడం జరిగింది. నలుగురు విద్యార్థులకు సోలార్ లైట్స్ మరియు వ్యవసాయానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ స్ప్రే పంపులు 4 ఇవ్వడం జరిగింది . ఈ ఆవులోని బాయి తాండ గ్రామంలో 30 ఇండ్లలో గుృహ భజనలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భగవాన్ బాబా వారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తుల అందరికీ ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ టీం ఇన్చార్జి IT శ్రీ D.విష్ణువర్ధన్ రావు గారు ఆర్ వి బిసి ఇన్చార్జి డాక్టర్ CVR కృష్ణ కుమార్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ గుబ్బ శంకరయ్య గారు, జిల్లా ఆఫీస్ బేరర్లు, సమితి కన్వీనర్లు, సేవ దళ్ సభ్యులు,వివిధ సేవా సమితుల సభ్యులు పాల్గొనడం జరిగింది. అవులోని బాయి తాండకు సంబంధించిన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అంగన్వాడి టీచర్ సరస్వతి మరియు వైద్య సిబ్బందికి సంబంధించిన ఏ ఎన్ ఎం విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదా సాయిసేవలో సత్య సాయి సేవా సంస్థలు. జిల్లా మహిళా విభాగం, జిల్లా మహిళా యువ విభాగం. నాగర్ కర్నూల్ జిల్లా