Bhajans



శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయినాధుని 96వ జయంతోత్సవ వేడుకలు తేదీ: 03 .08 .2021 మంగళ వారము ఆన్ లైన్ ప్రత్యేక భజన శ్రీ సత్య సాయి భగవానుడు అన్ని జీవులలో ఉంటూ, సమస్త భువనాలని సృష్టించి పోషిస్తూ, భక్తుల పాపాలను, శోకాలను నాశనం చేస్తూ మానవులలో ఆనందాన్ని పంచేవాడై, పాపుల పాపాలన్నీ పటాపంచలై చేస్తూ సేవాతత్పరత, సహృదయత గల మనిషిగా మలిచి పాలించు వాడు. ఎటువంటి మార్పు లేక, లక్షణ రహితుడై, సర్వవ్యాపియై, సర్వాతీత మైన శుద్ధ ఛైతన్యమూర్తియే బ్రహ్మము, ఆ పరమాత్మ శ్రీ సత్య సాయి నాధునికి ప్రణమిల్లుతూ వారి 96 వ జయంతోత్సవ వేడుకల భాగముగా నిర్వహించుకుంటున్న 96 రోజుల నిత్యా ప్రభాత సేవా మరియు సాయంత్రం ఆన్ లైన్ ప్రత్యేక భజనల కార్యక్రమములో నేడు భూదేవినగర్ వాస్తవ్యులు శ్రీ శ్రీనివాస రావు గారి నివాసములో నిర్వహించడం జరిగినది. ఈ ప్రత్యేక ఆన్ లైన్ భజనలో భక్తులు 38 చరవాణిల ద్వారా 78 భక్తులు వారి కుటుంబ సహితముగా పాల్గొని స్వామి కి తమ హృదయ పుష్పాలను సమర్పించుకున్నారు.