Carona 2020






శ్రీ సత్య సాయి సేవా సమితి - అల్వాల్ మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా శ్రీ సత్య సాయి అర్తత్రాణపరాయణాయ నమః శ్రీ సత్య సాయి నాధుడుని ఎవరైతే అర్థితో తలుస్తారో ప్రేమాస్వరూపుడైన స్వామి ఆర్తత్రాణపరాయణుడైన వారిని తప్పక అనుగ్రహిస్తాడు మరియు తన పనిముట్లు అయినా మనల్ని వినియోగించుకొని వారి ఇతి భాదల్ని తీరుస్తాడని నేడు నిరూపితమైంది. కౌకూర్ బాలాజీ నగర్ దివ్యాంగుల కాలనీ లో నివసిస్తున్న 20 అంధుల కుటుంబాలవారు మరియు వారి కాలనీ లో కరోనా వైరస్ తో భాదితులైన 10 మంది కుటుంబాలవారు అల్వాల్ సమితి ఆశ్రయించి తమని తమ కుటుంబాలకు నేటి విపత్కర పరిస్థిలో వారిని ఆదుకోవాలని కోరగా నేడు అంధుల కుటుంబాలకు 20 మరియు కరోనా భాదితులకు 10 చొప్పున మొత్తము 30 శ్రీ సత్య సాయి అమృత కలశములు (ఒక కుటుంబానికి 30 రోజుల సరిపడా నిత్యావసర ఆహార కిరాణా సామాగ్రిని )అందించి సేవలందించి స్వామి వారి దివ్య చరణాలవిందములకు సేవా కుసుమాలు సమర్పించడం నేటి విశేషము. సదా సాయి సేవలో మీ జె ఈశ్వర్ రావు, కన్వీనర్