ఓం శ్రీసాయిరాం, చిన్నప్పుడు ఒకసారి మన శ్రీ సీతారాంబాబు గారు వారి అక్కయ్య మరియు చెల్లెలు ముగ్గురు కలసి ఒక దసరా సందర్భంగా స్వామి వారి వద్ద "శ్రీరామ కళ్యాణం" బుర్రకథ వేసినారు. ప్రదర్శనకు ముందు సీతారాంబాబుగారి సోదరి నాగమణిగారు స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి ఆశీర్వదించండి అన్నారట. స్వామి అన్నారు శ్రీరామ కళ్యాణం స్క్రిప్ట్ చూపించండి అన్నారట, చూపించగా అది చూసి స్వామి.. కళ్యాణం వరకు చాలు తరువాత భాగము వద్దు అన్నారట. అప్పుడు నాగమణిగారు లేదు స్వామి మేము బాగా ట్రైనింగ్ అయ్యాము మేము వేస్తాము అని మారాం చేశారట. స్వామి నవ్వి ఊరుకున్నారట. స్వామి ఎదురుగా కూర్చున్నారు... బుర్రకథ ప్రారంభమైంది. వీనుల విందుగా కొనసాగుతుంది... కళ్యాణ ఘట్టం పూర్తయింది. అకస్మాత్తుగా నాగమణి గారు తర్వాత చెప్పవలసిన పోర్షన్ అంతా మర్చిపోయారట. ముగ్గురికి జ్ఞాపకం రాలేదట. స్వామి వంక దీనంగా చూశారట. స్వామి నవ్వుతూ స్టేజ్ మీదకి వెళ్లి ముగ్గురికి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వదించారట. స్వామి ముందే చెప్పాను కదా, కళ్యాణం వరకు చాలని. నాకు సంతోషం అయిందిలే అన్నారట. లీలా మానుషధారి లీలలు ఇలా హాయిగా ఉంటాయి. సాయిరాం