ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అపార కృప అనుగ్రహ ప్రేమాశీస్సు లతో రంగారెడ్డి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ద్వారా Dec 2020 నుండి 2025 Nov వరకు జరుపుకునే స్వామివారి (100 వ జన్మదిన) శత జయంతి ఉత్సవాల వేడుకలలో భాగంగా తేదీ 21-02-2021 ఆదివారంనాడు వేద పండితులచే ,మరియు వేదము పఠించే మన సాయి కుటుంభ సభ్యులచే యువతచే సామూహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సాయీశ్వర మహాదేవుని కి పంచామృతాలతో,పంచ పండ్ల రసములతో,పంచద్రవ్యములతో,నదీజలములతో ,విభూతితో అభిషేకం జరిగింది ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణము, బిల్వాష్టకము,లింగాష్టకము,శ్రీ సూక్తము,పురుష సూక్త పారాయణము, మరియు మహాశివ లింగమునకు చక్కటి అలంకారంతో మరియు సప్త హారతులు, భజన మరియు భగవాన్ బాబా వారికి మహా మంగళ హారతి తో వేడుక ముగించట మైనది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆనంద ఆధ్యాత్మిక కార్యక్రమమును శ్రీ సాయి కృష్ణ కాలనీలో గల శ్రీ సత్యసాయి మందిరము చేవెళ్ల నందు ఉ"8.28 నుండి మధ్యాహ్నం 01-45 గం"వరకు నిర్వహించ బడినది. ఇట్టి మహత్కార్యం,వేద పఠనంలో శ్రీ పాపిరెడ్డి గారు మంచిర్యాల, మంచిర్యాల జిల్లా DSC గారు ఇతర సమన్వయ కర్తలు, రంగారెడ్డి జిల్లా సమన్వయకర్తలు, వివిధ సమితుల కన్వీనర్లు, సమన్వయకర్తలు, భక్తులు, సాయి కుటుంబ సభ్యులు మహిళలు,యువత సుమారు 550 మంది పైగా పాల్గొన్నారు. మరియు స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ గారు వివిధ గ్రామ సేవ మెడికల్ క్యాంప్స్ లో ఫాల్గొన్న డాక్టర్ మిత్రులు పాల్గొని వారి పవిత్ర భక్తి హృదయాలతో స్వామి వారిని అభిషేకించి శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు, పాత్రులయ్యామని సంతోషం వ్యక్తపరుస్తూ ,ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకోడానికి అవకాశమిచ్చిన మన బంగారు తండ్రి పరిపూర్ణావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద శ్రీ చరణములకు కృతజ్ఞాతాపూర్వక అనంత కోటి వందనములు సమర్పిస్తూ, ఈ చక్కటి వేడుక చేవెళ్ల సమితి కన్వీనర్, మరియు అందరూ సభ్యులు,మహిళలు యువత ,ఐక్యతతో స్వామి వారిని ఎలా మెప్పించాలి అనే తపన,తాపత్రయము భక్తి ,విశ్వాసాలతో ,ఈ ఆనంద వేడుక విజయములో ముఖ్య పాత్ర పోషించారు. మందిరం చక్కటి అలంకారంతో మరియు అందరి భక్తులకు మహా ప్రసాదముతో ఏర్పాట్లు చేసిన వారికి , స్వామి వారి కృప,దయ అనుగ్రహ , ఆశీస్సులు దండిగా మెండుగా అందిస్తారని ప్రార్థిస్థూ, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక శుభ వందనములు, సాయిరాం వచ్చే నెల ఐదవ (5) రుద్రాభిషేఖ కార్యక్రమముగా *తేదీ 07.03.2021 ఆదివారంనాడు* మంచిర్యాల సమితి మందిరం లో మళ్ళీ ఇలాంటి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖము వేడుక చేసుకోవటం జరుగుతుంది. సాయిరాం సదా శ్రీ సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా,తెలంగాణ