Om శ్రీ సాయి Ram కందుకూరు మండలంలోని కొత్తూర్ గ్రామ వాసి శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఏడాది క్రితం బైక్ ప్రమాధములో వారి కాలు పొగుట్టుకున్నాడు.. మరియు వారి మనవడు ఆ ప్రమాదంలో చనిపోయాడు.. రంగారెడ్డి జిల్లా లో గ్రామ వైద్య సేవల ద్వారా పరిచయమైన డాక్టర్ రవీందర్ రెడ్డి గారి ద్వారా ఈ విషయము మనకు తెలియ చేసారు.. ఈ విషయం వెంటనే రాష్ట్ర వైద్య సమన్వయకర్త శ్రీ.G. భాస్కర్ రావు గారికి తెలియచేయగా,వారు వెంటనే స్పందించి వారు నడిచేలా ఏర్పాట్లు కొరకు కృత్రిమ కాలు చేయించడానికి అన్ని ఏర్పాట్లు మేడ్చల్ జిల్లా DP గారి ద్వారా ఏర్పాట్లు చేయించారు. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాశీస్సులతో భారత్ వికాస్ పరిషత్ ట్రస్ట్ వారి ద్వారా కూకట్ పల్లి సమితి సభ్యుల సహకారంతో వారి చక్కటి స్పందన తో శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి నడవడానికి వీలయ్యేలా కృత్రిమ కాలు ఈ రోజు తేదీ.25.02.21 గురువారం నాడు ఏర్పాటు చేసి వారికి అమర్చి వారి స్వగ్రామం పంపనైనది.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద చరణములకు కృతజ్ఞతాపూర్వక ఆనంతకోటి వందనములు సమర్పిస్తూ, ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక సాయిరాం సాయిరాం సదా సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా తెలంగాణ