ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేడు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శ్రీ సత్య సాయి మందిరంలో "మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం" కన్నుల పండుగగా నిర్వహించుకోవడం అయింది. జరిగిన కార్యక్రమ వివరాలు, మహాన్యాస పూర్వక గణపతి పూజ, BHEL సమితి యువతచే 11 సార్లు ఏకాదశ రుద్ర పారాయణం, భజన, అర్హులైన మహిళలకు చీరల పంపిణీ, స్వామి వారి పూర్వ విద్యార్థి అయిన శ్రీ. కే. అనిల్ కుమార్ (BHEL) గారిచే రుద్రం యొక్క విశిష్టత, మహా మంగళహారతి, మహా ప్రసాదం. తదుపరి సంగారెడ్డి జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా వివిధ సమితి నుండి కన్వీనర్లు, పదాధికారులు, మరియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గారు హాజరయ్యారు. సదా సాయి సేవలో కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవ సమితి-జోగిపేట