ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ప్రేమాశీస్తులతో. తేదీ:- 07-02-2021 రోజున, ఆదివారం,ఉ- 10 గం||లకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , సిద్దిపేట జిల్లాలో అన్ని సమితి , భజనమండలీలో , బాలవికాస్ సెంటర్లలో ◆ శ్రీ సాయిగాయత్రి తండులార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాలురు :- 75 బాలికలు :- 115 గురువులు & ఇతరులు :-28 మొత్తం సంఖ్య :- 218 మరియు ◆ జిల్లాలో బాలవికాస్ 3rd గ్రూప్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు 'కాన్వికేషన్' సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది. మరియు ◆ సిద్దిపేట సమితిలో సమితి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో చర్చించిన విషయాల వివరములు. ● శ్రీ సత్యసాయి వాహినిల మరియు స్వాధ్యాయం గురించి ఈ నెల 18 రథసప్తమి నుండి నిర్వహించే కార్యక్రమం గురించి కూడా చర్చించడం జరిగింది. ● All India ప్రెసిడెంట్ మరియు మన State ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించే 6000 గ్రామాల సమగ్ర గ్రామసేవ నిర్వహణ కార్యక్రమం గురించి, ప్రతి సమితికి 2 గ్రామాల ఎంపిక గురించి చర్చించడం జరిగింది. మరియు ● వైద్య సేవలు ప్రత్యేకంగా చిన్నపిల్లల వినికిడి లోపం గురించి శ్రీ సత్యసాయి రాష్ట్ర మెడికల్ కో-ఆర్డినేటర్ 'శ్రీ భాస్కర్ రావు' గారు సమితిలో సిద్దిపేట జిల్లాలో చక్కగా వివరించారు. ఈ విషయం పై కూడా చర్చించడం జరిగింది. భగవానుని అనుగ్రహముతో ఈ కార్యక్రమంలో ★ రాష్ట్ర మెడికల్ కో-ఆర్డినేటర్ ★ జిల్లా అధ్యక్షులు ★ జిల్లా ఆఫీస్ బేరస్ ★ మహిళా ఇంచార్జెస్ ★ సమితి కన్వీనర్లు ★ సిద్దిపేట సమితిలోని భజనమండలీల కన్వీనర్లు ★ భక్తులు ★ గ్రామసేవ మహాయజ్ఞం లోని భక్తులు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవానుని కృపకు పాత్రులయ్యారు. స్వామి వారి అనుగ్రహముతో ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని స్వామిని వేడుకుంటున్నాము. జై సాయిరాం