Service


ఓం శ్రి సాయిరాం, సంచార నారాయణులు యాచకులు మన యాతనలను దూరం చేసే యతీశ్వర్లు వారు మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను దూరం చేస్తారు . ఈ అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి స్థాయికైన దిగజారుస్తాయి అంటే ఇవి మనిషి పతనానికి, ఇవి ఉండేవారి మనసులో ఎల్లప్పుడు స్వార్థం,సంకుచిత భావాలే ఎక్కువగా ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఇటువంటి అరిషడ్వర్గాలు దూరం చేసే సులభమైన మార్గం స్వామి చూపిన బాటలో నారాయణ సేవ ఒకటి. ఈ సాధనలో మనలోని మానవత్వం పెంపొంది జీవితం ధన్యము గావించుకుంటాం. నిన్న తేదీ: 06.02.2021 మొదటి శనివారం సందర్బంగా ఆల్వాల్ శ్రీ సత్య సాయి సేవా మందిరంలో ఆల్వాల్ మరియు అనుబంధ భజన మండలి సంయుక్తముగా ఆహార పదార్థాలు వండి, ప్యాకెట్లు గ ప్యాక్ చేసి ఆల్వాల్ మరియు అనుబంధ భజన మండలి పుర వీధుల్లో సంచరించే 172 మంది నారాయణలకు ఆహార పాకెట్స్ అందించి మరియు 20 మందికి అమృత కలశములు(ఒక్కరికీ ఒక నెల సరిపడ నిత్యా ఆహార కిరానా సరుకు ) అందించి స్వామి వారి కృపా కటాక్షములు మరియు సేవాభావమ్ము పెంపొందించమని ప్రార్థిస్తూ..సేవలందించారు. ఈ సంచార నారాయణ సేవా మరియు అమృత కలశ వితరణలో ఆరుగురు మహిళా సేవాదళ్ సభ్యులు మరియు తొమ్మిది మంది పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. జై సాయిరాం