శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భద్రాద్రి జిల్లా తరఫున దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెం గ్రామంలో 1) సమగ్ర పశు వైద్య శిబిరం నిర్వహించి పశువులకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా, మందులు ఇంజెక్షన్లు అందించ నైనది. 2) అర్హులైన ఐదుగురికి ఐదు అమృత కలశములు, బెడ్ షీట్స్ 3) ఇద్దరు గర్భిణీ స్త్రీలకు అరకిలో ఖర్జూరం, 4) పిల్లలకు విలువలతో కూడిన బాలవికాస్ తరగతులు మరియు ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం, 5) వెటరినరీ స్టాఫ్ కు exam pads అందించడమైనది. స్థానిక MLA శ్రీ మెచ్చ నాగేశ్వర రావు గారు , zptc గారు, గ్రామ సర్పంచ్ గారు, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు , డాక్టర్ రమేష్ బాబు గారు, డాక్టర్ ఉమా కుమారి గారు మరియు అశ్వారావుపేట సమితి సభ్యులు పాల్గొన్నారు.