ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ముందు స్వామి వారికి సమర్పించిన త్రైమాసిక కార్యాచరణ లో భాగంగా జనవరి నెల సేవ కార్యక్రం అయినటువంటి వృద్ధాశ్రమ మరియు అనాథ ఆశ్రమ సేవ కార్యక్రమం ప్రశాంత్ నగర్ సమితి, సంగారెడ్డి జిల్లా యువత మియాపూర్ లో ఉన్నటువంటి *ఆశ్రయ వృద్ధాశ్రమo * లో ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సేవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా యువత ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేయడం, కలుపు మొక్కలను తీసేయడం, మొక్కలకు నీరు పోయడం మరియు ఉత్సాహవంతంగా స్వామి వారి భజన చేయడం జరిగింది. అలాగే వృద్దులకు కొంత సరుకులు, బిస్కెట్స్ మరియు పండ్లు పంపిణి చేయడం జరిగింది. పై కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ సమితి కో-కన్వీనర్ గారు, ఆధ్యాత్మిక సమన్వయకర్త, సేవ విభాగం సమన్వయకర్త, సంగారెడ్డి జిల్లా యువ సమన్వయకర్త మరియు సుమారు 20 మంది యువత పాల్గొనడం జరిగింది. జై సాయిరాం,