Narayana Seva

శ్రీ సత్యసాయి సేవా సమితి - ఆల్వాల్ మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా ,తెలంగాణ సంచార అన్నార్తులకు శ్రీ సత్య సాయి అన్న ప్రసాదం అందించి వారికి యధా శక్తి సేవలందించి స్వామి వారి కృపాకటాక్షములు పొందాలని నేడు సంచార నారాయణ సేవ శ్రీ సత్య సాయి సేవా మందిరంలో సేవాదళ్ సభ్యులు వండి, వండినటువంటి సత్య సాయి భోజన ప్రసాదమును ప్యాకెట్లుగా చేసి అల్వాల్ మరియు భజన మండలి పరిసర పుర వీధులలో సంచరించే 150 మంది నిరుపేద నారాయణులకు అందించి మరియు ప్రతి నెలా యధావిధిగా అందించే 17 మందికి నిత్యా అవసర కిరానా సరుకుల అమృత కలశములు అందించి సేవాదళ్ సభ్యులు సేవలో పాల్గొని స్వామి వారి పాదపద్మాల యందు సేవా కుసుమాలను సమర్పించారు. ఈ సేవలో నలుగురు మహిళా సేవాదళ్ సభ్యులు మరియు ఎనిమిది మంది పురుష సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు జె ఈశ్వర్ రావు కన్వీనర్.