Carona 2020



శ్రీ సత్య సాయి సేవా సమితి -అల్వాల్ * సాయిరాం, తేదీ: 08.04.2020 బుధవారం నాడు అల్వాల్ పరిసర ప్రాంతములో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న కారణంగా లాక్ డౌన్ సందర్బంగా గృహ నిర్మాణపు పనులు నిమ్మితమై వచ్చిన మరియు ఇతర వలస కూలీలు కొన్ని వందల మంది ఆప్పన్న హస్తం కోసం ఈ పరిసరాల్లో ఎదురు చూస్తున్నా సందర్బంగా ఛత్తిస్గడ్ నుంచి వలస వచ్చిన కూలీలులైన 50 కుటుంబాలకు నేడు వారికీ అనగా ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులకు 10 రోజుల సరిపడా (రోజుకి 200 మంది చెప్పున 10 రోజులులకు అంటే 2000 మందికి సరిపడా అన్నమాట ) వంట చేసుకొనే కిరానా సామాగ్రి ఐన అమృత కళాశాలు వారికి శ్రీ సత్య సాయి సేవా సమితి అల్వాల్ సభ్యులచే అందించడం జరిగినది. ఈ మహత్ సేవ కార్యక్రమములో సేవలందించినా సేవాదళ్ సబ్యులకు పేరు పేరున మరి మరీ అల్వాల్ సమితి తరుపున మా ప్రత్యేక సాయిరాం, వారికీ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహము కలగాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ విశిష్ట సేవా కార్యక్రమములో మీరందరు తప్పనిసరిగా పాలుపంచుకోవాలని కోరుకుంటూ ఇతర వివరాలకు కన్వీనర్ గారి సెల్ నెంబర్ 92465 43129 కి సంప్రదించాలని కోరుతున్నాము. -జె. ఈశ్వర్ రావు కన్వీనర్.```