🙏 ఓం శ్రీ సాయిరాం🙏 👏👏చిన్న భజన మండలి - అద్భుతమయిన సేవ👏👏 లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుండి ఎవ్వరూ బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సమితి పరిధిలోని మలకవరం అను చిన్న భజన మండలి కన్వీనర్ శ్రీ అంకత ఉమా మహేశ్వర రావు గారికి, భజన మండలి సభ్యులకు గ్రామ ప్రజలకు ఏదేని అవసరమైన సేవ చేయాలని అనిపించింది. స్వామిని ప్రార్థించి ఒక వినూత్నమైన సేవకు శ్రీకారం చుట్టారు. సడలింపు సమయంలో దగ్గర్లోని అశ్వారావుపేట పట్టణంలోని రైతు బజారు కు వెళ్లి 4, 5 ఏప్రిల్ రెండు రోజులలో మలక వరం గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకవరం గ్రామము, తాలమడ మరియు గుత్తా వారిగూడెము లో 750 కుటుంబాలకు ఒక్కొక ఇంటికి కిలో వంకాయ, కిలో బెండ కాయ, కిలో దొండ కాయ, ఒక సొరకాయ కూరగాయలు పంపిణీ చేయగా గ్రామస్థులు మరియు పాల్గొన్న జడ్.పి.టీ.సి., ఎం.పి. టి సి మరియు ఇతర అధికారులు శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవా నిరతిని కొనియాడడమే కాకుండా , భగవాన్ బాబా వారికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారములు సమర్పించుకున్నారు.🙏👏🙏