భగవాన్ బాబా వారి అనంత అనుగ్రహముతో భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట సమితి అనంతారం గ్రామములో సోమవారం, 2 మార్చి నాడు శ్రీ రేగళ్ల అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాల లో 10వ, 9 వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సన్నద్ధులగుట, దీర్ఘ కాలిక ప్రణాళిక అను అంశము మీద మాట్లాడి అందరినీ ఉత్సాహపరచినారు. ఇంతకు పూర్వం 3 రోజుల క్రితం 5,6 తరగతుల విద్యార్థులకు బాబా వారి బోధల ఆధారంగా పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడము ఎలా అను అంశము మీద మాట్లాడగా, అధ్యాపకులందరు చాలా స్ఫూర్తి పొంది, వెంటనే 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేయడం విశేషం. స్వామి దయకు నిదర్శనం.