భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అవతార ప్రకటన దినోత్సవ సందర్బంగా ఆదివారం, 20.10.2019 తేదీన పాల్వంచ శ్రీ సత్యసాయి సేవా సమితి లో ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, సాయంత్రం గం.5.15 కు పల్లకీసేవ జరిగింది. భద్రాద్రి జిల్లా గిరిజన గ్రామం చలమన్న నగర్ లో సాయి జనని వైద్య శిబిరం నిర్వహించ బడింది. ఈ శిబిరం లో ఒక డాక్టర్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇద్దరు ఫార్మాసిస్ట్ లు 12 మంది జెంట్స్ సేవాదళ్,ఒక మహిళా సేవాదళ్ పాల్గొన్నారు. 45 మంది పురుషులు, 53 మంది స్త్రీలు మొత్తం 98 మంది పేషంట్లు లబ్ది పొందారు.