సాయిరాం. భగవాన్ కరుణాకటాక్షములతో ఈ రోజు (18.08.2019) సత్యసాయి మందిరం పాల్వంచ లో పాతnపాల్వంచ హైస్కూల్ నకు చెందిన 9వ తరగతి బాలికలకు వస్త్ర వితరణ జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా 25 మంది బాలికలు లబ్ధి పొందినారు. వారందరికీ స్వామి కానుకగా DP శ్రీ అనిల్ కుమార్ గారిచే వ్రాయబడిన "విజయీభవ" (విద్యార్థుల విజయమునకు మార్గదర్శక సూత్రములు) పుస్తకం, కంపాస్ బాక్స్ మరియు బిస్కెట్స్ కానుకగా ఇవ్వగా వారు ఎంతో సంతోషించారు.