బాలవికాస్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా వనస్థలిపురం బాలవికాస్ విద్యార్థుల ఆధ్యాత్మిక విజ్ఞాన యాత్ర శ్రీ విద్యాసరస్వతి మాత దేవాలయం, వర్గల్ గ్రామం లో తేదీ 1.5.19 న జరిగింది. ఈ కార్యక్రమంలో 58 మంది బాలవికాస్ వద్యార్థినీ విద్యార్థులు మరియు గురువులు, తల్లితండ్రులు, సేవాదాల్ సభ్యులు కలిపి 25 మంది పాల్గొన్నారు. 1.5.19 తేదీ ఉదయము రెండు బస్సులలో శ్రీ సత్య సాయి ప్రేమ సేవ సదన్, వనస్థలిపురం నుంచి ఉదయం 8.15 ని. బయలుదేరి .9.45 కి చేరినాము. అచ్చట తెలంగాణ రాష్ట్ర బాలవికాస్ సమన్వయకర్త శ్రీ సుఖేందర్ గారు మమ్మల్ని receive చేసుకున్నారు. వారు దగ్గర ఉండి అమ్మవారి దర్శనం చేయించినారు. మాకు ఏర్పాటు చేసిన హాలులో ఈక్రింది కార్యక్రమములు నిర్వహించాము. శ్రీ విద్యాసరస్వతి ఆలయ వేద పండితులు బాలవికాస్ పిల్లలను, పెద్దలను ఆశీర్వదించారు. ఈ క్రింది విషయములపై పలువురు వక్తలు మాట్లాడినారు. 1.వేదము - ప్రాముఖ్యత వక్త : సాయి తేజ 2. భజన - ప్రాముఖ్యత వక్త : శ్రీమతి రమామణి 3. నిత్య జీవితములో మనవతా విలువలు వక్త : శ్రీమతి శాంతి. 4. తల్లిదండ్రులను -దేశమును గౌరవించుట - ప్రేమించుట వక్త : శ్రీమతి ప్రమీల దేవి 5.All religions are one. సర్వ మతముల సమైక్యత- ఏకం సత్. వక్త : శ్రీ నటరాజన్ 6.ఆరోగ్యము పరిశుభ్రత వక్త : శ్రీమతి అరుణ 7. పంచ భూతములు వక్త : శ్రీమతి సుభాషిణి 8. ఆటలలో ఆధ్యాత్మికత వక్త : శ్రీమతి రమామణి 9. పిల్లలచే ఆధ్యాత్మిక క్రీడలు చివరగా ప్రాంతీయ సమన్వయ కర్త శ్రీ శ్రీనివాస్ రెడ్డిగారి ముగింపుపలుకులు, శ్రీ సుఖేంద్రగారి తుది పలుకులు మరియు కన్వీనర్ వందన సమర్పణతో కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమము పూర్తిగా శ్రీ సుఖేంద్ర గారి పర్యవేక్షణలో వారి సూచనలతో, జరిపించడమైనది. తదుపరి రత్నాలయం లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనము చేసుకొని క్షేమంగా తిరిగి వనస్థలిపురంకి రావడం జరిగింది. ఈకార్యక్రమము దిగ్విజయముగా జరిపించిన స్వామివారికి సర్వదా కృతజ్ఞతలు. తెరవెనుక ఉండి తగిన సూచనలు, సహాయ సహకారములు అందచేసి ప్రోత్సహించిన వారి అందరకీ అభినందనలు.