ఓం శ్రీ సాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సంగారెడ్డి జిల్లా మహిళ యువ విభాగం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సమితి జోగిపేట మందిరంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ మరియు ఎంబ్రాయిడరి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 45 రోజులు 275 గంటలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రసిడెంట్ శ్రీ కృష్ణ కుమార్ గారు, స్టేట్ మహిళ యువ సమన్వయకర్త శ్రీమతి నివేదిత గారు, జిల్లా మహిళ సమన్వయకర్త శ్రీమతి సుమన్ లత గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ శంకరప్ప గారు, జిల్లా మహిళ యువ సమన్వయకర్త శ్రీమతి మాధవిలత గారు మరియు కన్వీనర్ సదాశివగౌడ్ గారు సమితి సభ్యులు పాల్గొన్నారు.